NLG: రైతులు తొందరపడి ధాన్యం ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మి మద్దతు ధర పొందడంతో పాటు బోనస్ పొందాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి నల్గొండలోని చర్లపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించి మాట్లాడారు.