BPT: నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలోని పరిశవారిపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతిడి వివరాలు తెలియాల్సి ఉంది.