SKLM: లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన పలువురు శ్రీ ముఖలింగం ఆలయ దర్శనం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం క్షత గాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు సూచించారు.