KDP: పులివెందులలో గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఎస్టీ ట్రైబల్ హాస్టల్ నిర్మాణానికి బీటెక్ రవి చొరవతో మార్గం సుగమమైంది. బుధవారం ఆయన రెవెన్యూ శాఖ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, స్థల కేటాయింపు చేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ డీటీ వెంకట రెడ్డి స్థలాన్ని కేటాయించారు. దీంతో విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది.