సత్యసాయి: జిల్లా జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా గోరంట్ల మోహన్ సురేశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మండల బీజేపీ ఆధ్వర్యంలో మోహన్ సురేశ్‌ను ఇవాళ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ శ్రీనివాసులు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.