ASR: పాడేరులోని సబ్ డ్రగ్ స్టోర్స్‌ను డీఎంహెచ్‌వో డా.కృష్ణమూర్తి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీసు రూమ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందులు, శస్త్రచికిత్స సామాగ్రిని తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. స్టోర్‌కు వచ్చిన విలువైన ఔషధాలు, మందులు, శస్త్రచికిత్స సామాగ్రిని కంప్యూటరీకరణ ద్వారా రికార్డుల్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.