ADB: బోథ్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు పదో తరగతి విద్యార్థుల నుండి పరీక్ష ఫీజు పేరిట అధిక ఫీజును వసూలు చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. AISF నాయకులు ఇవాళ బోథ్ MEO హుస్సేన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం రూ.125 నిర్ణయించగా కొన్ని పాఠశాలలు రూ.700 నుండి రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయన్నారు. AISF నాయకులు మున్సిఫ్, నరేష్, కార్తీక్, ప్రేమ్ పాల్గొన్నారు.