ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామంలో ఇవాళ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలోని సుమారు 50 ఇళ్లకు శానిటైజేషన్ చేశారు. చలికాలం దృష్ట్యా ప్రజలు దగ్గు, జ్వరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్, ప్రశాంత్, ఉత్తమ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.