ELR: రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. మంగళవారం జీలుగుమిల్లి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.