W.G: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా పాలకొల్లులోని శ్రీ దాసాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు మరుధూరి శ్రీనివాస్, స్వామివారిని పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పంచామృతాభిషేకాలు, గోత్రనామార్చనలు నిర్వహించారు. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.