E.G: దేవరపల్లి మండలం కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో మండల లెవెల్ ట్రైయినింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. మండలంలో గల 15 పంచాయతీల సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో తమవంతు ఆదాయం పెంపొందించుకోవాలని మంగళవారం, బుధవారం ఈ కార్యక్రమం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగరాజు అన్నారు.దుద్దుకూరు పంచాయతీ కార్యదర్శిరామచంద్రరావు పాల్గొన్నారు.