కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టరేట్లో పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా పలు పరిశ్రమలకు సంబంధించి ఆమె శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.