AP: బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఇవాళ చీరాల, వేటపాలెం, కారంచేడు మండలాల్లో పర్యటన నిర్వహించింది. తుఫాన్ ప్రభావంతో చీరాల, వేటపాలెం మండల పరిధిలో దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్డులను, రామాపురం, చల్లారెడ్డిపాలెం పంచాయితీ పరిధిలో దెబ్బతిన్న వంతెనలను, నీట మునిగిన వరి పంటను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.