MDCL: నూతన ఇంటి గృహప్రవేశం సందర్భంగా యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కీసర మండలం చీర్యాలలో చోటుచేసుకుంది. బాలాజీ ఎంక్లేవ్లోని సదానందం ఇంట్లో ఇవాళ జరిగిన వేడుకకు వచ్చిన ఇద్దరు హిజ్రాలు రూ.1లక్ష డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా.. 15 మంది హిజ్రాలు 3 ఆటోల్లో వచ్చి కర్రలతో దాడి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.