SRCL: చందుర్తి మండలం లింగంపేట, మర్రిగడ్డ గ్రామాల్లో మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీజేపీ నాయకులు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా ఉండడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉచిత సైకిళ్ల పంపిణీ చేపట్టారన్నారు.