GDWL: ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం రోడ్డుకు మరమ్మతులు చేపట్టామని అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు తెలిపారు. మంగళవారం చిన్న తాండ్రపాడు గ్రామం నుంచి కేశవరం, వేణిసోంపురం గ్రామాల మీదుగా గుంతలమయమైన రోడ్డుకు ఆయన తన సొంత నిధులతో జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని పంపించారు.