ఏలూరు జిల్లాను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం కుష్ఠువ్యాధి గుర్తింపు, నిర్ధారణకు ప్రత్యేక కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈనెల 17 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి కుష్ఠువ్యాధిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ఆదేశించారు.