ADB: తెలంగాణ రచయిత, గాయకుడు అందెశ్రీ మరణం కళాకారులకు తీరని లోటని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు పేర్కొన్నారు. బజార్హత్నూర్ మండలంలోని దేగమ పాఠశాలలో అందెశ్రీ మరణం పట్ల ఇవాళ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ అని కొనియాడారు.