సత్యసాయి: మడకశిర మండలం తురకవాండ్లపల్లిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మురళిధర్ విధులు సక్రమంగా నిర్వర్తించలేదని ఉపాధ్యాయునిపై ఎమ్మెల్యే MS రాజుకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు.. ఇవాళ మండల ఎంఈవో భాస్కర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. విచారణ చేపట్టి ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసు అందజేశారు.