HNK: భీమదేవరపల్లి మండలం వల్భపూర్, సూరారం గ్రామాల్లో కోతుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటల కోతల అనంతరం రైతులు ధాన్యం ఆరబోస్తుండగా.. వానరాలు రాశుల పై దండెత్తి నాశనం చేస్తున్నాయి. ఈ సమస్యను నివారించాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందించడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.