సంతాన లేమికి మగవారి ఊబకాయం కూడా కారణమే అని పరిశోధకులు చెప్తున్నారు. బరువు తగ్గితే సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అయితే.. వ్యాయామ నియమాలతో కొద్దిగా బరువు తగ్గినా కూడా వీర్యం నాణ్యత మెరుగవుతుందట. బేరియాట్రిక్ శస్త్రచికిత్సలతో ఎక్కువ బరువు తగ్గినా సానుకూల మార్పులేవీ ఉండవట. దీంతో మగవారు పోషకాహారం, వ్యాయామం మీద దృష్టి పెట్టటం మంచిదని సూచిస్తున్నారు.