W.G: విశ్వ సాహితీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా భీమవరం పట్టణానికి చెందిన చౌటపల్లి నీరజాచంద్రన్ నియమితులయ్యారు. విభిన్న సాహితీ ప్రక్రియలలో భాగంగా కవయిత్రి, రచయిత్రిగా నీరజాచంద్రన్ ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. తన ప్రతిభను గుర్తించి ఎంపిక చేసిన విశ్వ సాహితీ కళావేదిక వ్యవస్థాపకులు కొల్లి రమాదేవికి కృతజ్ఞతలు తెలియజేశారు.