NTR: జగ్గయ్యపేట నియోజకవర్గం, బండిపాలెం గ్రామంలో న్యూ హోప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పి. ప్రభుదాస్, రూత్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో న్యూ హోప్ చర్చి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆనంతరం ఇంఛార్జ్ మాట్లాడుతూ.. ఆయన మనుషులను సత్యపథం వైపు నడిపేలా యేసు క్రీస్తు మార్గనిర్దేశం చేశారని తెలిపారు.