BHPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైద్యం కోసం రేగొండ, పరకాలలకు వెళ్లాల్సి వస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చినా చర్యలు కనిపించడంలేదన్నారు. మండల కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం కూడా అందించాలని కోరుతున్నారు.