NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల్ ప్రియ అమరావతిలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం ఆళ్లగడ్డ శిల్పాలు, కళాకారులు రూపొందించిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రతిమను అందజేశారు.