NLR: ఉలవపాడు మండలం, చాకిచర్ల గ్రామంలో 2022లో జరిగిన తండ్రి హత్య కేసులో, నిందితుడైన కుమారుడు కృష్ణకు ఒంగోలు కోర్టు జీవిత ఖైదు విధించింది. తండ్రి తనను పట్టించుకోవడం లేదనే కోపంతో కృష్ణ, ఇనుప రాడ్తో తలపై కొట్టి, గొంతు కోసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. ఈ సంచలన తీర్పును ADJ రాజ్యలక్ష్మి వెలువరించారు. ఈ వివరాలను కందుకూరు CI అన్వర్ బాషా తెలిపారు.