SKLM: కవిటిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం విశ్వనాథం మాట్లాడుతూ.. బాల్యవివాహాల వల్ల జీవితం నాశనమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో అవగాహన ర్యాలీని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.