కోనసీమ: ఆత్రేయపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాం గణంలో ఈనెల 12, 13వ తేదీలలో ఉదయం 9 గంటల నుంచి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్య నిపుణుల ఆధ్వర్యంలో శరీర పరీక్షలు, ఆరోగ్య సలహాలు, సిఫార్సులు ఇవ్వబడతాయని అన్నారు. చుట్టుపక్కల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.