రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ డిసెంబరులో భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు క్రెమ్లిన్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. రష్యాలో భవన నిర్మాణం, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. దీంతో 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని.. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరనున్నట్లు వార్తలొస్తున్నాయి.