MNCL: బెల్లంపల్లి మండలం రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహిళ భక్తురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన అర్చకులు మంగళవారం పూజలు నిర్వహించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 13న అర్చకులు పూజల పేరిట ఒక మహిళా భక్తురాలి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన పై వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అర్చకునిపై శాఖ పరమైన చర్యలు తీసుకొకపోతే మహిళలు నిరసన చేస్తామన్నారు.