KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకి ఎగువ నుంచి వస్తున్న వరద 75 రోజులుగా కొనసాగుతుంది. నేడు ప్రాజెక్టులోకి 2498 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. దీంతో ఒక వరద గేటు ఎత్తి ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగుల మెయింటైన్ చేస్తూ 2498 క్యూసెక్కుల వరద నీటిని మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.