NRML: జిల్లా కలెక్టరేట్లో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మౌలానా ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. యువత ఆయన ఆలోచనలను అనుసరించాలని పిలుపునిచ్చారు.