ప్రకాశం: ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో MSME ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు.