W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం పెనుమంట్ర మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను గ్రామస్తులకు వివరించి, సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు సుదీర్ రెడ్డి, సర్పంచ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నరు.