AP: గత పాలకుల విధ్వంస విధానాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందన్నారు. అన్ని రోగాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. అన్నీ తెలిసిన డాక్టర్ లాంటి తనకే నాడీ అర్థం కావడం లేదని తెలిపారు. ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని గాడినపెడుతున్నామని వెల్లడించారు.