KRNL: దేశంలో విద్యా రంగానికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు వెలకట్టలేనివని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలను తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.