ADB: భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన దార్శనికుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆజాద్ 137వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. మైనారిటీల విద్యా అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేసిన వ్యక్తి అబుల్ కలాం అని కొనియాడారు.