కోనసీమ: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి వద్ద మంగళవారం నిర్వహించిన జనవాణిలో మండపేట జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీల కృష్ణ పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలను విని అర్జీలు స్వీకరించారు. అనంతరం వీటిని తక్షణ పరిష్కారం కోసం వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పారు.