భారత్-సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) ప్రత్యేక బంగారు నాణెంను ఉపయోగించనుంది. ఈ నాణెంపై ఒక వైపు మహాత్మా గాంధీ, మరోవైపు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించారు. ఈడెన్ గార్డెన్స్, గువాహటి వేదికగా జరిగే రెండు టెస్టుల్లో ఇదే నాణేన్ని వాడనున్నారు.