భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్కు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడ్డాడు. అతడు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో సౌతాఫ్రికా సిరీస్కు అతడికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.