కృష్ణా: రేపటితో పంట నమోదు గడువు ముగియనున్నందున రైతులు ఈ రోజు లేదా రేపటిలోపు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి ఎస్. జెన్నీ తెలిపారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 18 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని, ప్రతి కేంద్రంలో పీపీసీ సిబ్బంది రైతులకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.