ATP: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు సభ్యునిగా నియమితులైన భూమే వెంకటనారాయణను ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. మంగళవారం ఆమె క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నేతలతో కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.