WGL: ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని బెంగళూరు-ముజఫర్‌పూర్, యశ్వంతపూర్-ముజఫర్‌పూర్ మధ్య నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లను వరంగల్, కాజీపేట మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి. వరంగల్‌తో పాటు పలు స్టేషన్లలో స్టాపేజీలు కల్పించారు.