TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు తప్ప.. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 40.2 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతోన్న ఉపఎన్నికలల్లో జూబ్లీహిల్స్లోనే ఇప్పటివరకు తక్కువ పోలింగ్ నమోదు కావడం విశేషం.