ADB: ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదువుతున్నాయి. ఉదయం పొగ మంచుతో రహదారులు కనిపించక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.