MBNR: కురుమూర్తి స్వామి ఉద్దాలు దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పోటెత్తారు. స్వామి వారి ఉద్దాలకు చాలా మహిమ ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏడాది వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో భక్తుల రాక తగ్గడంతో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను నవంబరు 17 వరకు పొడిగించారు. దీంతో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లభించింది.