VZM: వంగర మండలం అరసాడ గ్రామంలో PVS గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు రూ.102 కోట్ల వ్యయంతో కంపోస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి సీఎం చంద్రబాబు కనిగిరి నుండి మంగళవారం ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. రోజుకు 20 టన్నులు ఉత్పత్తి సామర్ధ్యం గల ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.