VZM: చీపురుపల్లి పట్టణంలోని కనకమహాలక్ష్మి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మూడో సోమవారం సందర్బంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు.