NTR: విజయవాడలోని కానూరులో బుధవారం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షలు విలువ చేసే 249 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈగల్ & రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా జరిపిన దాడులలో ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిశాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరు విజయవాడ, ముగ్గురు ఒడిశాకు చెందిన మొత్తం ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.