KKD: సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జున్ రావు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. స్వామి,అమ్మవారి దర్శనం అనంతరం నంది మండపం నందు ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో బళ్ల నీలకంఠం, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్ బాబు, సిఐ కృష్ణ భగవాన్ పాల్గొన్నారు.